ఉపాధ్యాయుల వివాహేతర సంబంధం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న టీచర్ భర్త
Mulugu | ములుగు జిల్లా మంగపేటలో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయుల వివాహేతర సంబంధం బట్టబయలైంది. టీచర్ భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని వారిద్దరినీ పోలీసులకు అప్పగించాడు.
ములుగు : ములుగు జిల్లా మంగపేటలో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయుల వివాహేతర సంబంధం బట్టబయలైంది. టీచర్ భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని వారిద్దరినీ పోలీసులకు అప్పగించాడు.
వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తికి కొత్తబెస్తగూడెం పాఠశాలలో డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్న మరో ఉపాధ్యాయినికి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే తన భార్య ప్రవర్తనపై భర్తకు అనుమానం వచ్చింది.
ఈ క్రమంలో సోమవారం రాత్రి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయిని ఒకే ఇంట్లో కలిసి ఉన్న సమయంలో టీచర్ భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం ఆయన తన బంధుమిత్రులకు సమాచారం అందించాడు. వారిద్దరికి దేహశుద్ధి చేసి తాళ్లతో కట్టేశారు. అనంతరం మంగపేట పోలీసులకు అప్పగించారు. వివాహేతర సంబంధం విషయమై గతంలో పలుమార్లు మందలించినా తీరు మారలేదని ఉపాధ్యాయిని భర్త, అతని బంధువులు తెలిపారు. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

