వరంగల్ : ఈత సరదా వారి ప్రాణాల మీదకు తెచ్చింది. కాతీయ కెనాల్లో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ విషాదకర సంఘటన వరంగల్లోని డాక్టర్స్ కాలనీ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా ఈత కొట్టేందుకు నలుగురు విద్యార్థులు కాతీయ కెనాల్లో దిగారు.
వీరిలో ఇద్దరు విద్యార్థులు నీటిలో గల్లంతయ్యారు. ఈత కొడుతున్న సమయంలో ఇద్దరు నీటి ప్రవాహంలో కొట్టుకు పోయారని, వెంట ఉన్న మిగతా ఇద్దరు తమ కుటుంబ సభ్యులకు తెలిపారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గల్లంతైన ఇద్దరు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ఇద్దరు విద్యార్థులు కూడా వరంగల్ కొత్తవాడకు చెందిన వారని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.