నల్లగొండ : ఏపీలోని గుంటూరు జిల్లా నడికుడ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఢీకొట్టడంతో తల్లీతో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతులను నల్లగొండ జిల్లాకేంద్రంలోని చైతన్యపురి కాలనీకి చెందినవారుగా గుర్తించారు. ఇద్దరు పిల్లలతో కలిసితో నడికుడ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా సోమవారం రాత్రి సుమారు ఏడున్నర గంటల ప్రాంతంలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది.
రమ్య (28), ఆమె పిల్లలు రిషిక్ రెడ్డి(8), హంసిక (6) మృతిచెందారు. మృతదేహాలను సత్తెనపల్లి ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. నడికూడ రైల్వే పోలీసులు నల్లగొండలోని ఆమె భర్త , కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు సత్తెనపల్లికి తరలివెళ్లారు. ఈ సంఘటన ప్రమాదమా? ఆత్మహత్య అనే విషయం తెలియాల్సి ఉంది. పిల్లలిద్దరూ నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులోని ప్రేరణ స్కూల్లో చదువుతున్నారు.