మరికల్ : ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తెగిబడి మూడు గేదెలు మృతి చెందిన ఘటన శుక్రవారం మరికల్( Marikal ) మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. ఎస్సీ కాలనీ పాఠశాల సమీపంలో విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతుండడం తో ఆ వైర్లు గేదెలకు తగిలి ( Electrocution) మూడు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గేదెలు మృతి చెందడంతో తమ జీవనాధారం కోల్పోయ్యామని యజమాని మంతన్ గౌడ్ భాస్కర్ రెడ్డి అన్నారు. సుమారు రెండు లక్షల 50 వేల తమకు నష్టం వాటిల్లిందని తెలిపారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని బాధితుడు ఆరోపించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు వెటర్నరీ డాక్టర్ మహాదేవ్ పంచనామ నిర్వహించి నివేదికను అధికారులు అందజేస్తామని వెల్లడించారు.