చార్మినార్ : ట్వంటీట్వంటీ ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్న జట్టులో గెలుపు ఏ జట్టుదో అంటూ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గురిని దక్షిణ మండల టాస్క్‌పోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన సయ్యద్ కుతుబుద్దీన్, మహ్మద్ సుల్తాన్, షేక్ ఇర్ఫాన్‌లు క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు.
విశ్వసనీయ సమచారం మేరకు నిందితుల ఇళ్లపై దాడులు నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా నిందితుల వద్ద బెట్టింగ్‌లకు పాల్పడుతన్న 65వేల నగదును గుర్తించామని తెలిపారు. నిందితుల తదుపరి విచారణ నిమిత్తం సంతోష్ నగర్ పోలీసులకు అప్పగించామని తెలిపారు.