అమరావతి : ఏపీలో అల్లూరి జిల్లా (Alluri District) లో విషాదం చోటు చేసుకుంది. వాగులో స్నానానికి దిగిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. జిల్లాలోని రంపచోడవరం మండలం ఐపోలవరం గ్రామంలో ఉన్న సీతపల్లి వాగులో ముగ్గురు పదో తరగతి విద్యార్థులు (Tenth Students) స్నానానికి వెళ్లారు . వారు ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న గుంతలో పడి మృత్యువాత పడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. మృతులు తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కె ఎర్రంపాలెం వాసులుగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.