బోనకల్లు :బోనకాలు మండల కేంద్రంలోని శ్రీనవదుర్గాదేవి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు దొంగతనానికి యత్నించిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… సాయిబాబా మందిరం ఎదుట నూతనంగా అమ్మవారి దేవాలయం నిర్మించారు. ఆ దేవాలయంలో భక్తులు అమ్మవారికి కానుకలు సమర్పించేందుకు హుండీని ఏర్పాటు చేశారు. గుర్తుతెలియని దుండుగులు దేవాలయం ముందు ఏర్పాటు చేసిన గ్రిల్స్‌కు ఉన్న తాళాన్నిపగలగొట్టి ఆలయం ముందు ఏర్పాటు చేసిన హుండీని బయటకు ఈడ్చుకొచ్చి దానిని పగలగొట్టేందుకు కానీ లేక వేరేచోటుకు తరలించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తుంది.
ఈ మార్గంలో ప్రజల అలికిడి గమనించడంతో ఆ దుండగులు ఆ హుండీని అక్కడే వదిలేసి పారిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఉదయాన్నే పూజారి గమనించి వెంటనే ఆలయ చైర్మన్‌కు సమాచారం ఇచ్చారు. దేవాలయంలో నమోదైన సీసీపుటేజ్‌లో ఆరుగురు దుండగులు రాగా వారిలో నలుగురు మగవారు, ఇద్దరు మహిళలుగా గుర్తించారు. సాయిబాబా దేవాలయం చైర్మన్ సూర్యదేవర మోహన్‌రావు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో చోరీ యత్నంపై గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు.