పహాడీషరీఫ్ : పోచమ్మ ఆలయంలో చోరి జరిగిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పహాడీషరీఫ్‌లో ఉన్న పోచమ్మ ఆలయంలో మంగళవారం అర్థరాత్రి గుర్తు తెలియని దొంగ మొఖానికి మంకి క్యాప్ ధరించి పోచమ్మ ఆలయంలో చొరబడ్డాడు. ఆలయంలోని గంట, దీపాంతాలు తదితర ముఖ్యమైన వస్తువులను చోరి చేశాడు. చోరి ఘటన సీసీ ఫుటేజీలో నిక్షిప్తమైంది.
100కు డయల్ చేయడంతో పోలీసులు వచ్చి వివరాలు సేకరించుకుని వెళ్లారు. గతంలో కూడా దేవాలయంలో రెండు సార్లు చోరి జరిగింది. పోచమ్మ వారి బంగారు ముక్కుపుడుక, భక్తులు అమ్మవారికి సమర్పించిన చిన్నపాటి వెండి వస్తువులు గతంలో చోరికి గురయ్యాయని స్థానికులు తెలిపారు. ఇప్పుడు చోరి జరగడం రెండవ సారి అని తెలిపారు.