Monkey attack | కోతి దాడి నుంచి తప్పించుకోబోయిన మహిళ..అంతలోనే
Monkey attack | సంక్రాతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకుందామని వచ్చిన ఆ మహిళ పాలిట వానరం మృత్యు రూపంలో కబలించింది. కోతి దాడి నుంచి తప్పించుకోబోయి మృత్యువు ఒడికి చేరుకుంది.

జగిత్యాల : జిల్లాలో విషాదం చోటు చోటు చేసుకుంది. సంక్రాతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకుందామని వచ్చిన ఆ మహిళ పాలిట వానరం మృత్యు రూపంలో కబలించింది. కోతి దాడి నుంచి తప్పించుకోబోయి మృత్యువు ఒడికి చేరుకుంది.
వివరాల్లోకి వెళ్తే..ధర్మపురి పట్టణంలోని బ్రాహ్మణవాడకు చెందిన నారంభట్ల రాజేశ్వరి(50) అనే మహిళ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నది.
కాగా, సంక్రాంతి పండుగ సెలవుల కోసం స్వగ్రామమైన ధర్మపురికి రెండు రోజుల క్రితం వచ్చింది.
సదరు మహిళ నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ పైకి వెళ్లింది. అయితే అక్కడే ఉన్న ఓ కోతి ఆమెపై దాడి చేయడంతో భయాందోళనకు గురైన రాజేశ్వరి.. అక్కడ నుంచి కిందకు పరుగెత్తే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది.
మృతురాలికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

