శనివారం 24 అక్టోబర్ 2020
Crime - Oct 01, 2020 , 15:39:17

ముగ్గురు చిన్నారులను మింగిన చెరువు

ముగ్గురు చిన్నారులను మింగిన చెరువు

మెదక్ : రెక్కాడితే గాని డొక్కాడని కూలీ కుటుంబాలపై విధికి కన్నుకుట్టుంది. చెరువు రూపంలో పేగు బంధాన్ని చిదిమేసింది. చెరువు ఆ చిన్నారుల పాలిట మృత్యు కూపమైంది. ఊరికి ఆదెరువుగా ఉండే చెరువు ఆ రెండు కుటుంబాల్లో మాత్రం తీరని వేదనను మిగిల్చింది. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులను బలి తీసుకుంది. మాటల కందని ఈ హృదయవిదారక ఘటన జిల్లాలోని మనోహరాబాద్ మండలం దండుపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు ఆడుకుంటూ ఇంటి పక్కనే ఉన్న చెరువులోకి దిగారు.

ఈత రకాపోవడంతో పిల్లలు అందులోనే జల సమాధి అయ్యారు. మరో ఇద్దరు చిన్నారులు ఈదుతూ ప్రాణాలతో బయటపడ్డారు. మృతులు పిట్టల వాడకు చెందిన రవి, నవీన్, అఖిలగా గుర్తించారు. మృతులంతా 10 ఏండ్ల వయసు లోపు వారే. పిల్లల మరణ వార్త విన్న తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వారి ఆర్థనాదాలు పలువురిని కంటతడి పెట్టించాయి. చిన్నారుల మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.logo