దొంగల ముందు టెక్నాలజీ ఓడిపోయింది.. ముప్పులో కెనరా బ్యాంకు ఏటీఎంలు

సూరత్ : వారంతా నిరక్షరాస్యులు. ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని డబ్బు దొంగిలించడం వీరి పని. మొత్తం ఏటీఎంను తెరిచి పట్టుపడకుండా.. నకిలీ కీతో డిస్ప్లే తెరిచి డబ్బు అందగానే.. కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి నగదు అందలేదని ఫిర్యాదు చేసేవారు. ఇలా సూరత్‌లో దాదాపు 140 సార్లు చేసి సుమారుగా రూ.20 లక్షల మేర కాజేశారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఏటీఎం దొంగలను పట్టుకుని వారి నుంచి నాలుగు డెబిట్ కార్డులు, రెండు మొబైల్ ఫోన్లు, రూ.1.10 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
ఏటీఎం డిస్ప్లేను తెరిచి నగదు దొంగిలిస్తున్న మేవతి ముఠాకు చెందిన ఇద్దరు దుండగులను సూరత్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఏటీఎంను టార్గెట్‌గా పెట్టుకుని వెళ్తుండగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సూరత్ క్రైం బ్రాంచి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరత్‌లోని నాన్‌పురా ప్రాంతానికి చెందిన హనీఫ్ సయ్యద్, ఔసాఫ్ హసన్ మహ్మద్ సయ్యద్‌తోపాటు సాజిద్‌ఖాన్, జహీర్‌ఖాన్, ఇర్ఫాన్‌ఖాన్‌లు కష్టపడకుండా డబ్బు సంపాదించడంపై దృష్టిపెట్టారు. వీరిలో హనీఫ్ ఆరో తరగతి, ఔసాఫ్ మూడో తరగతి వరకు చదువుకున్నారు. మిగతా ముగ్గురు సోదరులు పూర్తిగా నిరక్షరాస్యులు. వీరు ఐదుగురు ముఠాగా ఏర్పడి ఏటీఎం డిస్ప్లేలను తెరిచి మాత్రమే నగదును తీసుకునేవారు. మొత్తం ఏటీఎంను తెరవడానికి బదులుగా నకిలీ కీతో డిస్ప్లే తెరుస్తారు. ప్రతి లావాదేవీ సమయంలో క్యాసెట్ నుంచి నోట్ పైకి వచ్చిన వెంటనే నోట్‌ను పైకి పంపి యంత్రం ఆగిపోతుంది. పైకి వచ్చిన నోట్లను తీసుకున్న తర్వాత.. కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి డబ్బు విత్‌డ్రా కాలేదని ఫిర్యాదు చేసేవారు. తొలుత వడోదరలో ఏటీఎంలతో వీలుపడకపోవడంతో ఈ ముఠా సూరత్‌కు వచ్చి తమ తెలివిని ప్రదర్శించి నగదు విత్‌డ్రా చేసుకునేవారు. అలా ఇచాపూర్, అట్వాలైన్స్, అడాజన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కెనరా బ్యాంక్ ఏటీఎంల నుంచి పలుమార్లు దొంగతనం చేసినట్లు అంగీకరించారు. సాజిద్, ఇర్ఫాన్, జహీర్‌లు 140 కి పైగా లావాదేవీల్లో దాదాపు రూ.20 లక్షలు దొంగిలించినట్లు తేలింది. వీరు చెప్పిన సమాచారం మేరకు సూరత్‌లోని నాలుగు ఏటీఎంలలో తనిఖీ చేశారు.
ఏటీఎంలు మార్చాల్సిందేనా?!
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ప్రధాన సూత్రధాని పూర్తిగా నిరక్షరాస్యుడు. ఈ ముఠా కెనరా బ్యాంక్ డీ బోల్ట్ కంపెనీ నిర్వహించేన ఏటీఎంలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నది. దొంగతనం, మోసాలను నివారించడం కోసం సంస్థ యొక్క అన్ని ఏటీఎంలను మార్చాలని పోలీసులు కెనరా బ్యాంక్ అధికారులకు స్పష్టం చేశారు. రిజర్వ్ బ్యాంకు 2018 నివేదిక ప్రకారం, కెనరా బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 9 వేలకు పైగా ఏటీఎంలు ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ
ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఆస్ట్రేలియాను మట్టి కరిపించిన టీమిండియా
- కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ డిశ్చార్జి
- ఖుషీ కపూర్ ఎంట్రీపై బోనీ కపూర్ క్లారిటీ..!
- తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన ఇందిరమ్మ
- నేతాజీ జయంతి ఇక పరాక్రమ్ దివస్
- రిపబ్లిక్ డే వేడుకలకు వారికి అనుమతి లేదు..
- ఆయిల్ పామ్ సాగుకు మరింత ప్రోత్సాహం : మంత్రి నిరంజన్‌రెడ్డి
- ఆస్ట్రేలియాలో క్వారెంటైన్.. టెన్షన్లో టెన్నిస్ ప్లేయర్లు
- 50 ఏళ్ల గవాస్కర్ రికార్డును బద్ధలు కొట్టిన శుభ్‌మన్ గిల్
- 17 ఏళ్ల బాలికపై 38 మంది లైంగిక దాడి