ములకలపల్లి : లైంగిక వేధింపుల ఆరోపణలతో ఓ ఉపాధ్యాయుడిని విద్యాశాఖ సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. దీనికి సంబంధించి ఎంఈవో శ్రీరామమూర్తి తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చాపరాలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న జి.రామ్‌లక్ష్మణ్ అదే పాఠశాలలో పనిచేస్తున్న సహ ఉపాధ్యాయురాలిని లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాధితురాలు ఇటీవల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి విద్యాశాఖ ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు విచారణ చేపట్టిన విద్యాశాఖ సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు ఎంఈవో తెలిపారు.