Adilabad | ఆదిలాబాద్ : విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ స్పోర్ట్స్ కోచ్( Sports Coach ) సస్పెండ్‌కు గురయ్యాడు. ఆదిలాబాద్( Adilabad )లోని తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్( Telangana State Sports School ) లో స్పోర్ట్స్ కోచ్ బీ రవీందర్ ఔట్ సోర్సింగ్ కింద విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి ఆ కోచ్.. విద్యార్థినులతో( Girl Students ) అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో విద్యార్థినుల ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్( Collector Rahul Raj ) చర్యలు తీసుకున్నారు. కోచ్ బీ రవీందర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదివారం కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే తొమ్మిదో తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థినులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. కోచ్ రవీందర్ విద్యార్థినులను వేధించినట్లు తేలడంతో.. ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.