బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ Bibinagar) మండంలో దారుణం చోటుచేసుకున్నది. బీబీనగర్ మండలంలోని కొత్త తండాలో శ్రీను అనే వ్యక్తి భార్యపై కోపంతో తల్లిని కొట్టి చంపాడు. కొత్తతండాకు చెందిన శ్రీను తన భార్యతో కలిసి పొరుగూరులో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆమెతో గొడవపడిన శ్రీను.. స్వగ్రామానికి వచ్చాడు. విషయం తెలుసుకున్న అతని తల్లి.. కుమారుడిని మందలించారు.
దీంతో కోపం కట్టలు తెంచుకోవడంతో సహనం కోల్పోయిన శ్రీను.. తల్లిని కర్రతో తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మరణించారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.