ఏపీ టూ తమిళనాడు : రూ 10 కోట్ల విలువైన 20 టన్నుల ఎర్రచందనం సీజ్!

చెన్నై : రూ 10 కోట్ల విలువైన 20 టన్నుల ఏ గ్రేడ్ స్మగుల్డ్ ఎర్ర చందనం దుంగలను తమిళనాడు పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. మధురై-ట్యుటికోరిన్ జాతీయ రహదారిలో పూడూర్ పందియపురం టోల్‌ప్లాజా సమీపంలోని యార్డ్ వద్ద ట్రక్‌లో ఈ దుంగలను భద్రపరిచారు.
స్మగ్లర్ల నుంచి 150 దుంగలను స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ జీ చందీష్ వెల్లడించారు. కొద్దివారాల కిందట ఎర్రచందనం దుంగలను ఆంధ్రప్రదేశ్ నుంచి మధురై మీదుగా ట్యుటికోరిన్‌కు తరలించారని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. వాటిని ఎగుమతి చేయడం కష్టం కావడంతో ట్యుటికోరిన్‌లోని యార్డ్‌లో భద్రంగా దాచారని పోలీసులు తెలిపారు.
ఎర్రచందనం దుంగలను పరిశీలించిన అటవీ శాఖ అధికారులు ఇవి అత్యుత్తమ నాణ్యతతో ఉన్నాయని, వీటి విలువ రూ 10 కోట్లపైనే ఉంటుందని అంచనా వేశారు. ట్రక్కు యజమాని, యార్డ్ ఓనర్‌తో పాటు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

