చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెంగల్పట్టు సమీపంలోని హైవే ఆర్టీసీకి చెందిన బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో పది మంది గాయపడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. చిదంబరం వెళ్తున్న బస్సు చెన్నై – తిరుచిరాపల్లి జాతీయ రహదారిపై మధురాంతకం వద్ద ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదంలో మరో పది మంది వరకు గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదం మృతులకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఇదిలా ఉండగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మృతులకు సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ.5లక్షల సహాయాన్ని ప్రకటించారు. చెంగల్పట్టు పోలీసుల కథనం ప్రకారం.. బస్సు తిరుచ్చి హైవేపై చెన్నై నుంచి చిదంబరం పట్టణానికి వెళ్తున్నది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Tamil Nadu | 6 dead, over 10 injured after a bus allegedly rammed into a lorry which was stationary, in Chengalpattu this morning, confirms district police pic.twitter.com/csxamjHiVb
— ANI (@ANI) July 8, 2022