Delhi Accident | నిధి అబద్ధం చెబుతోంది.. అంజలి మృతి కుట్రలో ఆమె పాత్ర
ఈ దారుణ ఘటనలో అంజలి అనే యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో.. అంజలి మద్యం సేవించి ఉందని, ఆమె స్పృహలో లేదని ప్రమాద సమయంలో మృతురాలితోపాటు ఉన్న ఆమె స్నేహితురాలు నిధి చెప్పింది.
Delhi Accident | కొత్త సంవత్సరం రోజున దేశరాజధాని ఢిల్లీ శివారు కాంజావాల్ ప్రాంతంలో 20 ఏండ్ల యువతిని కారు సుమారు 12 కిలోమీరట్ల మేర ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనలో అంజలి అనే యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో.. అంజలి మద్యం సేవించి ఉందని, ఆమె స్పృహలో లేదని ప్రమాద సమయంలో మృతురాలితోపాటు ఉన్న ఆమె స్నేహితురాలు నిధి చెప్పింది.
కాగా, నిధి ఆరోపణలను అంజలి కుటుంబం తీవ్రంగా ఖండించింది. నిధి అబద్ధం చెబుతోందని, తన కుమార్తె మరణం కుట్రలో నిధి భాగమని ఆరోపించింది. ‘నా కూతురు ఎప్పుడూ మద్యం సేవించలేదు. ఆమె ఎప్పుడూ తాగి ఇంటికి రాలేదు. నిధి అబద్ధం చెబుతోంది. నేను నిధిని ఎప్పుడూ చూడలేదు. ఆమె పేరు కూడా వినలేదు. ఆమె ఎప్పుడూ మా ఇంటికి కూడా రాలేదు. ఆమె నా కూతురి స్నేహితురాలైతే, ప్రమాద సమయంలో అంజలిని వదిలేసి ఎలా పారిపోతుంది? ఇది పథకం ప్రకారం చేసిన కుట్ర. ఇందులో నిధి పాత్ర కూడా ఉండొచ్చు. దీనిపై సమగ్ర విచారణ జరపాలి’ అని రేఖాదేవి డిమాండ్ చేశారు.
కాగా, శవపరీక్ష నివేదికలో అంజలిపై అత్యాచారం జరగలేదని, ప్రమాదం జరిగిన రాత్రి ఆమె మద్యం సేవించిన ఆనవాళ్లు కనిపించలేదని వెల్లడైంది. అయితే, అంజలి శరీరంపై 40కి పైగా గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్ట్లో తేలింది. యువతి శరీరం వెనుక భాగం ఛిద్రమైందని, దీంతో పక్కటెముకలు బయటకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తలభాగం తీవ్రంగా దెబ్బతిందని పేర్కొన్నాయి. వెన్నెముక, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రమాదంతో షాక్కు గురవడం, తీవ్ర రక్తస్రావం వల్లే అంజలి మృతి చెందిందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

