హైదరాబాద్ : హైదరాబాద్ బేగంపేట ( Begumpeta ) లోని ‘ఏవికన్స్ పైలెట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్’లో పైలెట్ కోర్సు అభ్యసిస్తున్న ఒక యువతిపై అదే సంస్థలో ఇన్స్ట్రక్టర్గా విధులు నిర్వహిస్తున్న నసిముద్దీన్ లైంగిక దాడికి ( Sexual Assault ) పాల్పడ్డాడు.
జనవరి 2025 నుంచి శిక్షణ ఇస్తాననే సాకుతో ఆమెపై పలుమార్లు అత్యాచారం చేయడమే కాకుండా, ఆ దృశ్యాలను ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్కు దిగాడు. బాధితురాలు బేగంపేట పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
కేరళ రాష్ట్రానికి చెందిన నసిముద్దీన్కు దమ్మాయిగూడకు చెందిన మరో ఇన్స్ట్రక్టర్ సల్మాన్ కూడా సహకరించినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే స్పందించి ప్రధాన నిందితుడు నసిముద్దీన్ను అదుపులోకి తీసుకున్నారు