Hyderabad | హైదరాబాద్‌లోని హస్తినాపురం వద్ద మద్యం మత్తులో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. కారును ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ హంగామా చేశాడు. ఓ ద్విచక్ర వాహనాన్ని, నడుచుకుంటూ వెళ్తున్న మరో యువకుడిని ఢీకొట్టాడు. వారిని 100 మీటర్లకు వరకు ఈడ్చుకెళ్లాడు. అనంతరం కారు పల్టీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు, నడుచుకుంటూ వెళ్తున్న మరో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బైక్‌పై వెళ్తున్న వారిని మహవీర్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన బీటెక్ విద్యార్థులు శివ, సందీప్‌గా గుర్తించారు.
యాక్సిడెంట్ గురించి తెలిసిన మహవీర్ విద్యార్థులు కారు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. డ్రైవర్‌ను తమకు అప్పగించాలని నినాదాలు చేశారు కాగా, యాక్సిడెంట్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ – హస్తినాపురం పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం
మద్యం మత్తులో రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న ఓ యువకుడిని, బైకుపై వెళ్తున్న శివ, సందీప్ అనే ఇద్దరు బీటెక్ విద్యార్థులను ఢీకొట్టి, 100 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లిన హోండా కారు
ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందిన ముగ్గురు యువకులు pic.twitter.com/vrP2fIgaMr
— Telugu Scribe (@TeluguScribe) April 8, 2026