న్యూఢిల్లీ : పోలీసులు, ప్రభుత్వం సైబర్ నేరాలపై ఎంతగా అవగాహన కల్పిస్తున్నా రోజుకో స్కామ్‌తో సైబర్ నేరగాళ్ల ఆగడాలు శృతి మించుతున్నాయి. పార్ట్‌టైం జాబ్ ఆఫర్లు, (Part Time Job Scam) వర్క్ ఫ్రం హోం ఆఫర్లు అంటూ అమాయకులను మభ్యపెట్టి రూ. కోట్లలో దండుకుంటున్నారు. ఆన్లైన్ టాస్క్‌ల పేరుతో మభ్యపెట్టి అందినకాడికి రాబట్టుకుంటూ ఆపై ముఖం చాటేస్తున్నారు. ఇక బీమా కంపెనీ రిటైర్డ్ ఉద్యోగిని టార్గెట్ చేసిన స్కామర్లు 58 ఏండ్ల బాధితుడిని బురిడీ కొట్టించి రూ. 31 లక్షలు దోచేశారు.
పార్ట్ టైం జాబ్ ఆఫర్ పేరుతో స్కామర్లు నమ్మబలకడంతో బాధితుడు తన పెన్షన్, గ్రాట్యుటీ సహా కష్టార్జితం మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పార్ట్‌టైం జాబ్ పేరుతో బాధితుడికి టెలిగ్రాం మెసేజ్ రావడంతో పార్ట్‌టైం జాబ్ చేసేందుకు బాధితుడు అంగీకరించాడు. ఇక యూట్యూబ్ వీడియో లింక్స్‌ను పంపిన స్కామర్ వాటిని లైక్ చేయడం ద్వారా కమిషన్ పొందవచ్చని మభ్యపెట్టాడు. తొలుత కొన్ని వీడియోలను బాధితుడు లైక్ చేయడంతో వాటికి కమిషన్ అందుకున్నాడు.
లింక్ ఓపెన్ చేసి యూట్యూబ్ వీడియోను లైక్ చేసిన అనంతరం బాధితుడు సదరు స్క్రీన్‌షాట్‌ను అదే గుర్తుతెలియని టెలిగ్రాం నెంబర్‌కు పంపేవాడు. ఇక కొద్దిరోజుల తర్వాత అధిక డబ్బు సంపాదించే అవకాశం ఉందని నమ్మబలుకుతూ బాధితుడిని స్కామర్లు వ్యాల్యూ యాడెడ్ టాస్క్ గ్రూప్‌లో చేర్చారు. ఇక టాస్క్‌లు పూర్తిచేసిన తర్వాత రిటన్స్ అందించడంతో స్కామర్లను బాధితుడు పూర్తిగా నమ్మాడు.
ఆపై పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేసే భారీ రిటన్స్ వస్తాయని మభ్యపెడుతూ అధిక మొత్తం పెట్టుబడి పెట్టించారు. వాటి తాలూకు రిటన్స్ అందించాలని బాధితుడు కోరగా మరికొంత ఇన్వెస్ట్ చేస్తే రిటన్స్ వస్తాయని స్కామర్లు ఒత్తిడి చేశారు. కొద్దిరోజులకు తన ఆన్లైన్ వాలెట్ లింక్ కనిపించకపోవడం, టెలిగ్రాంలో సంబంధిత నెంబర్‌ను కాంటాక్ట్ చేయలేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
Read More :
Indonesia | ఘోర పడవ ప్రమాదం.. 15 మంది మృతి.. 19 మంది గల్లంతు