Cyber Fraud : దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు ఇటీవల విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత కొద్ది నెలలుగా సైబర్ నేరగాళ్లు రోజుకో తరహా స్కామ్‌తో రెచ్చిపోతున్నారు. ఇక ఇటీవల పుణేకు చెందిన 68 ఏండ్ల రిటైర్డ్ కెమికల్ ఇంజనీర్ ఫేక్ కాల్ రిసీవ్ చేసుకున్న అనంతరం రూ. 81 లక్షలు కోల్పోయారు. మే మూడో వారంలో ఓ గుర్తుతెలియని నెంబర్ నుంచి బాధితుడికి ఫేక్ కాల్ వచ్చింది.
చట్టవిరుద్ధ ప్రకటనలు, అభ్యంతరకర కంటెంట్‌కు సంబంధించి మీ మొబైల్ నెంబర్‌పై 24 ఫిర్యాదులు వచ్చాయని నిందితుడు బెదిరించాడు. ముంబైలోని ఫోర్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని, బాధితుడితో పాటు ఆయన భార్య ఫోన్ నెంబర్లు డిస్కనెక్ట్ అవుతాయని బెదిరించాడు. తన కట్టుకథను మరింత రక్తి కట్టించేందుకు ఫోర్ట్ పోలీస్ స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్గా పరిచయం చేస్తూ మరో వ్యక్తిని కనెక్ట్ చేశాడు.
బాధిత ఇంజనీర్ మనీల్యాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఈ సమస్య పరిష్కరించేందుకు ముంబై సీబీఐ చీఫ్‌తో మాట్లాడాల్సి ఉంటుందని ఇన్స్పెక్టర్ నమ్మబలికాడు. నేరారోపణల నుంచి మీ పేరు తొలగించేందుకు ప్రభుత్వ ఖాతాల్లో రూ. 81 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్లుగా జమ చేయాలని మభ్యపెట్టాడు. ఆపై మరికొంత డబ్బు కోసం నిందితులు ఒత్తిడి చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read More :