సోమవారం 18 జనవరి 2021
Crime - Nov 06, 2020 , 13:04:40

విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

న్యూఢిల్లీ : ఇందిరాగాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో దుబాయి నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి నుంచి రూ.27.5లక్షల విలువైన విదేశీ కరెన్సీని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్) స్వాధీనం చేసుకుంది. నిందితుడిని ఆష్కిన్‌గా గుర్తించి, దాచిన విదేశీ కరెన్సీని అతని బ్యాగ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ‘బ్యాగ్‌ను భౌతికంగా తనిఖీ చేస్తున్నప్పుడు.. సుమారు రూ. 27.5 లక్షల విలువైన 1,52,000 సౌదీ రియాల్స్ బ్యాగ్ దిగువన దాచినట్లు గుర్తించామని’ తెలిపింది. తదుపరి చర్యలో కోసం నిందితుడిని కస్టమ్స్ అధికారులకు అప్పగించినట్లు వివరించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.