7వ తరగతి విద్యార్థినిపై టీచర్ లైంగిక దాడి

జైపూర్: ఏడవ తరగతి విద్యార్థినిపై ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు లైంగిక దాడి చేశాడు. రాజస్థాన్‌లోని ఝున్ఝన్హు జిల్లాలో ఈ దారుణం జరిగింది. 11 ఏండ్ల బాలికపై 31 ఏండ్ల టీచర్ ఈ నెల 5న స్కూలు తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. దీంతో బాధితురాలు కొన్ని రోజులు మౌనం వహించింది. అయితే తరగతి పుస్తకంలోని చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్‌ను చూసిన ఆ బాలిక గురువారం ఫోన్ చేసింది. జరిగిన దారుణం గురించి చెప్పింది. దీంతో పిల్లల సంరక్షణ కమిటీ సభ్యులు ఆ బాలిక ఇంటికి వచ్చారు. టీచర్ లైంగిక దాడి గురించి ఎస్పీకి తెలిపారు. నిందితుడు ఆమెకు కొంత కాలంగా అసభ్య సందేశాలు పంపుతున్నట్లు చెప్పారు.
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అల్వార్ జిల్లాలో కుటుంబంతో కలిసి ఉన్న కీచక ఉపాధ్యాయుడ్ని గురువారం సాయంత్రం అరెస్ట్ చేశారు. కాగా నిందితుడి కుటుంబమంతా విద్యావంతులని, అతడి భార్య కూడా మరో జిల్లాలో టీచర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

