అల్వార్ లైంగిక దాడి కేసులో వెలుగులోకి కీలక విషయాలు

జైపూర్ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన అల్వార్ లైంగిక దాడి కేసును రాజస్థాన్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. మానసిక వికలాంగురాలైన 15 ఏండ్ల బాలికపై అల్వార్ జిల్లాలో లైంగిక దాడి జరిపిన దుండగుడు బాధితురాలిని ఫ్లైఓవర్‌పై పడవేసి వెళ్లిన ఘటన ఆందోళన రేకెత్తించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన రాజస్ధాన్ పోలీసులు బాలికపై లైంగిక దాడి జరగలేదని చెబుతున్నారు.
జనవరి 11న అల్వార్ ఫ్లైఓవర్ వద్ద రక్తపు మడుగులో బాలిక కనిపించింది. సాంకేతిక ఆధారాలు, వైద్య నివేదికల ప్రకారం బాలికపై లైంగిక వేధింపులు జరగలేదని వెల్లడించాయని రాజస్ధాన్ పోలీసులు చెప్పుకొచ్చారు. బాలిక ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం కావడంతో ఆమెపై లైంగిక దాడి జరిగి ఉంటుందని అనుమానించారు.
బాధితురాలి ఇంటి నుంచి ఫ్లైఓవర్ ప్రారంభమయ్యే వరకూ పలు సీసీటీవీల ఫుటేజ్‌ను పరిశీలించామని పోలీసులు పేర్కొన్నారు. బాలిక తన గ్రామం నుంచి సిటీకి వచ్చిన ఆటో డ్రైవర్‌నూ పోలీసులు ప్రశ్నించారు. మరోవైపు ఆటోలో బాలికపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. ఇక బాలిక ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

