Drugs seized | నిషేధిత ఉత్ప్రేరక ఔషధాలు సీజ్

చార్మినార్ : శారీరక అలసట లేకుండా నిరంతరం వ్యాయమ ప్రక్రియ కొనసాగించేందుకు వినియోగించే నిషేధిత ఉత్ఫ్రేరక ఔషధాల అమ్మకాలు సాగిస్తున్న ఓ కేంద్రంపై దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం…
చాంద్రయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ప్రాంతానికి చెందిన షేక్ నయీం, మహ్మద్ యాహియాలు స్థానిక సాద్ మెడికల్‌హాల్‌లో పని చేస్తున్నారు. ఔషదాల పనితీరుపై అవగాహన ఏర్పర్చుకున్న వారిద్దరూ పాత నగరంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న జిమ్‌లలో వ్యాయమం చేసే యువతతో మాటలు కలిపేవారు.
కండరాల పెరుగుదలను ఉత్ప్రేరించే ఔషదాలను వినియోగిస్తూ వ్యాయమం చేస్తే తక్కువ సమయంలోనే మంచి కండపుష్టి ఏర్పడుతుందని ప్రచారం చేస్తూ కావలసిన ఔషదాలను అధిక ధరలకు విక్రయించే వారు. ఈ విషయమై విశ్వసనీయ సమచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌పోర్స్ పోలీసులు నిందితుల ఇండ్లపై చార్మినార్ ఏరియా డ్రగ్స్ ఇన్స్పెక్టర్తో కలిసి దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో మెఫేన్ టెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్స్లను భారీస్థాయిలో గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. తరుపరి విచారణ నిమిత్తం నిందితులను చాంద్రయణగుట్ట పోలీసులకు అప్పగించారు. దాడుల్లో ఎస్సైలు మహమద్ తఖీయుద్దీన్, నరేందర్, శ్రీశైలం, చంద్రమోహన్, ప్రతాప్‌రెడ్డిలు పాల్గొన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

