శుక్రవారం 07 ఆగస్టు 2020
Crime - Jul 04, 2020 , 10:46:38

నకిరేకల్‌లో 50 కిలోల గంజాయి పట్టివేత

నకిరేకల్‌లో 50 కిలోల గంజాయి పట్టివేత

నల్లగొండ: జిల్లాలోని నకిరేకల్‌ మండలంలో భారీగా గంజాయి పట్టుబడింది. ఇవాళ తెల్లవారుజామున విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న కారు మండలంలోని చందంపల్లి స్టేజి వద్ద ఓ ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. దీంతో కారులో అక్రమంగా తరలిస్తున్న 50 కిలోల గంజాయి బయటపడింది. స్థానికులు దీన్ని గమనించడంతో మహిళ మినహా కారులో ఉన్న వ్యక్తులు పరారయ్యారు. కారులో మొత్తం 50 కేజీల గంజాయి ఉందని, ఒక్కో పొట్లం రెండు కేజీల చొప్పున ఉందని పోలీసులు తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, కారులో ప్రయాణిస్తున్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్యాకెట్లలో ఉన్నది గంజాయేనా లేదా మరేవైనా మత్తుపదర్థాల అన్నది పరీక్ష చేసిన తర్వాత నిర్ధారిస్తామని నకిరేకల్‌ సీఐ బాలగోపాల్‌ వెల్లడించారు.


logo