Sangareddy | సంగారెడ్డి : పటాన్చెరు పరిధిలోని ముత్తంగి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్న పోలీసుల వాహనం బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడ్డ పోలీసుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే పోలీసులు వెళ్తున్న వాహనం టైర్ పేలిపోవడంతోనే బోల్తా పడినట్లు పోలీసులు నిర్ధారించారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు చెందిన పోలీసులు.. విధుల్లో భాగంగా సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.