సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Jun 17, 2020 , 14:40:55

నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

 నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

మహబూబ్ నగర్: ప్రభుత్వం నిషేధించిన మత్తు పదార్థాలు సరఫరా చేసినా, విక్రయించినా వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. జిల్లాలోని బాదేపల్లి గ్రామంలో రెండు దుకాణాలపై ప్రత్యేక పోలీసు బృందం జరిపిన దాడులలో సుమారు రూ. లక్షా డెబ్భై వేల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నారు. చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై పోలీసు ప్రత్యేక బృందాలు నిరంతరం దృష్టి పెడుతాయన్నారు. వీరిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ  హెచ్చరించారు. నిందితులు బాదేపల్లికి చెందిన దొంతుల విజయ్, మహేష్ లను అదుపులోకి తీసుకుని జడ్చర్ల పీఎస్ లో కేసు నమోదు చేశారు.


logo