Praneeth Hanumanthu | యూట్యూబర్ ప్రదీప్ హనుమంతుపై మరో కేసు
సామాజిక మాధ్యమంలో తండ్రి, కూతురు ఆడుకుంటున్న వీడియోపై అసభ్యకర కామెంట్లు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై (Praneeth Hanumanthu) మరోకేసు నమోదైంది. మత్తుపదార్థాలు సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలడంతో అతనిపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్: సామాజిక మాధ్యమంలో తండ్రి, కూతురు ఆడుకుంటున్న వీడియోపై అసభ్యకర కామెంట్లు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై (Praneeth Hanumanthu) మరోకేసు నమోదైంది. మత్తుపదార్థాలు సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలడంతో అతనిపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ప్రణీత్‌ను ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న అతడిని 3 రోజులు కస్టడీకి కోరుతూ సైబర్ సెక్యూరిటీ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
యూట్యూబర్ ప్రణీత్ హన్మంతును ఈ నెల 10న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అమెరికాకు పారిపోతుండగా బెంగళూరులో అతడిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్, డల్లాస్ నాగేశ్వర్రావు, మరో ఇద్దరు కలిసి ‘డార్క్ కామెడీ’ పేరుతో ఓ తండ్రీ-కూతురు వీడియోపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసి శునకానందం పొందారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తొలుత నటుడు సాయిధరమ్ తేజ్ స్పందించారు. ‘సోషల్ మీడియాలో మృగాలు ఎకువైపోయాయి. పిల్లల వీడియోలను సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి’ అంటూ ఆయన ఓ పోస్టు పెట్టారు. ప్రణీత్‌పై చర్యలు తీసుకోవాలని టాలీవుడ్ నటులు మంచు మనోజ్, విశ్వక్సేన్, అడివిశేష్, కార్తికేయ, సుధీర్‌బాబు సహా పలువురు ఏపీ, టీజీ ప్రభుత్వాలను కోరారు. ఈ నేపథ్యంలో ప్రణీత్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. మిగతా ముగ్గురిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు.
సారీ అంటే సరిపోతుందా?
ప్రణీత్ రూపొందించిన వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ‘సారీ’ అంటూ ఆయన సింపుల్‌గా ఓ వీడియో రిలీజ్ చేశాడు. దీంతో ‘అరాచకంగా మాట్లాడి సారీ చెప్తే సరిపోతుందా?’ అని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఐఏఎస్ అధికారి అరుణ్‌కుమార్ తనయుడు ప్రణీత్ తనయుడైన ప్రణీత్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లలో ఒకడు. రోస్ట్ వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యాడు. అతని చానల్‌కు లక్షకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రణీత్ అన్నయ్య అజయ్ హనుమంతు కూడా యూట్యూబరే. ైస్టెలిష్ టిప్స్‌తో పాపులర్ అయిన ‘ఏ జూడ్’ చానల్‌ను ఆయన నడిపిస్తున్నాడు.
విదేశాల్లో ఉంటూ అభ్యంతరకర పోస్టులు
కొందరు విదేశాల్లో ఉండి సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టులు పెడుతూ ప్రజల మధ్య ద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడంతో పగలు, ప్రతీకారాలను తీర్చుకునేందుకు సోషల్ మీడియాను వేదికగా వాడుకొంటున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లంతా నిబంధనలను పాటించేలా చూడాలని, చట్టాలను ఉల్లంఘిస్తే శిక్షలకు గురికాక తప్పదన్న భయం కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

