చెన్నై : ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసి తిరుపతికి తీసుకువచ్చిన స్కూల్ టీచర్‌ను తిరుపతిలో కోయంబత్తూర్ పోలీసులు అరెస్ట్ చేసి బాలికలను విడిపించారు. బాలికల్లో ఒకరికి 19 ఏండ్లు కాగా మరో బాలిక (16) నిందితుడి వద్దకు ట్యూషన్‌కు హాజరవుతుండేది. స్కూల్ టీచర్‌ను కోయంబత్తూర్‌కు చెందిన మణిమరన్గా గుర్తించారు.
కోయంబత్తూర్‌లో డ్యాన్స్ టీచర్‌గా పనిచేస్తున్న మణిమరన్ తన వద్దకు ట్యూషన్‌కు వచ్చే బాలికతో పాటు 2021 జులై నుంచి కనిపించకుండా పోయాడు. దర్యాప్తులో భాగంగా మణిమరన్ కన్యాకుమారికి చెందిన 19 ఏండ్ల బాలికను కూడా కిడ్నాప్ చేశాడని వెల్లడైంది. ఈ కేసుకు సంబంధించి కన్యాకుమారి పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఈ క్రమంలో 19 ఏండ్ల బాలిక తన స్నేహితురాలికి ఫోన్ చేసి తాను మణిమరన్ చెరలో తిరుపతిలో ఉన్నానని తెలిపింది. దీంతో బాలిక ఆచూకీని బాధితురాలు తల్లితండ్రులు, పోలీసులకు ఆమె సమాచారం అందించింది. సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా కోయంబత్తూర్ పోలీసులు మణిమరన్ను తిరుపతిలో గుర్తించి అరెస్ట్ చేశారు. అతడి చెర నుంచి ఇద్దరు బాలికలను విడిపించారు.