న్యూఢిల్లీ : ఆన్లైన్ అడ్డగా సైబర్ నేరగాళ్లు (Cyder Fraud) చెలరేగుతూనే ఉన్నారు. తాజాగా ఢిల్లీలో ఏకంగా పోలీస్ అధికారినే బురిడీ కొట్టించిన కేటుగాళ్లు రూ. 2 లక్షలు కొట్టేశారు. పోన్ఫే క్యాష్‌బ్యాక్ ఆఫర్ స్కామ్‌తో పోలీస్ అధికారిని బోల్తా కొట్టించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ పోలీస్ అధికారికి గుర్తుతెలియని నెంబర్ నుంచి కాల్ చేసిన వ్యక్తి ఫోన్‌పే లావాదేవీపై క్యాష్‌బ్యాక్ ఆఫర్ గెలుచుకున్నారని నమ్మబలికాడు.
క్యాష్‌బ్యాక్‌ను పొందేందుకు మరో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించాడు. ఇది ఫోన్‌పే అనుబంధ యాప్ అని మభ్యపెట్టాడు. ఈ యాప్‌ను పోలీస్ అధికారిని మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు టూల్లా ఉపయోగించుకున్నారు. దీంతో ఈ యాప్‌ను అధికారి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే ఆయన స్మార్ట్‌ఫోన్ స్కామర్ల కంట్రోల్లోకి వెళ్లిపోయింది.
అధికారి ఫోన్‌ను ఉపయోగించుకున్న స్కామర్లు ఆయన బ్యాంక్ ఖాతాతో పాటు క్రెడిట్ కార్డు నుంచి రూ. 2 లక్షలు పైగా వివిధ ఖాతాలకు బదలాయించారు. దీంతో మోసపోయినట్టు గుర్తించిన బాధిత అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అధికారిని బురిడీ కొట్టించిన నలుగురు స్కామర్లను అరెస్ట్ చేశారు.
Read More :
London | లండన్‌లో తెలుగమ్మాయిని పొడిచి చంపిన బ్రెజిల్ యువకుడు