Pesticides : పురుగుల మందు సేవించి యువకుడు ఆత్మహత్య..

పరిగి టౌన్ : పురుగుల మందు సేవించి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పరిగి పోలీస్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… పరిగి మున్సిపల్ పరిధిలోని బోయవాడకు చెందిన కుమ్మరి సాయికుమార్(21) శనివారం రాత్రి గడ్డిమందు తాగానని తన అన్న నవీన్‌కు ఫోన్‌చేసి చెప్పాడు. వెంటనే వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో ఉన్న తమ్ముడు సాయికుమార్‌ను చికిత్స నిమిత్తం పరిగి సర్కార్ దవాఖానకు తరలించారు.
అక్కడి నుంచి వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా అక్కడి డాక్టర్లు హైదరాబాద్‌కు రెపర్ చేయడంతో నగరంలోని ప్రీమియర్ దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 11.40 గంటలకు మృతి చెందాడన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

