సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Aug 08, 2020 , 11:11:15

నకిలీ విత్తనాల నిందితుడిపై పిడియాక్ట్‌

నకిలీ విత్తనాల నిందితుడిపై పిడియాక్ట్‌

నల్లగొండ : నకిలీ విత్తనాల కేసులో కీలక నిందితుడైన కర్నూలు జిల్లాకు చెందిన కర్నాటి మధుసూదన్‌రెడ్డిపై పిడి యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి, వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు చండూర్ సీఐ సురేష్ కుమార్ తెలిపారు. కొద్ది రోజుల కిందట భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్న పోలీసులు సమగ్ర విచారణ జరిపిన అనంతరం జిల్లా ఎస్పీ ఏవీ రంగనాధ్ ఆదేశాల మేరకు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో చండూర్ సీఐ పీడీ చట్ట కింద కేసు నమోదు చేశారు. నిందితున్ని శనివారం వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఎవరైనా నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు నకిలీ విత్తనాలు కొని నష్టపోకుండా పటిష్ట నిఘా  ఏర్పాటు చేశామని, నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo