Crime News | ప్రియుడితో పారిపోయేందుకు స్కెచ్.. ఎవరికీ అనుమానం రాకుండా తనలాగే ఉన్న యువతిని హత్య చేసి
Crime News | హర్యానా (Haryana) రాష్ట్రంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో పారిపోయేందుకు స్కెచ్ వేసిన ప్రియురాలు.. తాను చనిపోయానని ఇంట్లో వాళ్లని నమ్మించేందుకు చూడటానికి తనలాగే ఉన్న మరో యువతి ప్రాణం తీసింది.
Crime News | హర్యానా (Haryana) రాష్ట్రంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో పారిపోయేందుకు స్కెచ్ వేసిన ప్రియురాలు.. తాను చనిపోయానని ఇంట్లో వాళ్లని నమ్మించేందుకు చూడటానికి తనలాగే ఉన్న మరో యువతి ప్రాణం తీసింది. ఈ ఘటన 2017 సెప్టెంబర్ 5న జరగ్గా తాజాగా ఇప్పుడు బయటపడింది. రాష్ట్రంలోని పానిపత్ (Panipat) కు చెందిన జ్యోతి (Jyoti ), కృష్ణ కుమార్ (Krishan Kumar ) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వివాహ బంధంతో ఒక్కటి కావాలని అనుకున్నారు. ఈ క్రమంలో ప్రేమ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పారు. అయితే జ్యోతి ఇంట్లో వాళ్లు వీరి పెండ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరూ పారిపోయి పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఓ టీవీ సీరియల్ ఆధారంగా స్కెచ్ వేసుకున్నారు.
కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా ఉండేందుకు.. జ్యోతిలానే కనిపించే మరో యువతిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా జ్యోతి తన స్నేహితురాలైన సిమ్రన్ (20) (Simran)ను స్థానికంగా ఉన్న జీటీ రోడ్డుకు పిలిపించింది. సిమ్రన్ను మాటల్లో పెట్టి మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించింది. మత్తులోకి జారుకున్నాక గొంతు కోసి చంపేసింది. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా సిమ్రన్ (Simran) దుస్తులు మార్చి.. ఆ స్థలంలో జ్యోతికి సంబంధించిన కొన్ని గుర్తింపు కార్డులను పడేసి ప్రేమికులిద్దరూ అక్కడి నుంచి ఉడాయించారు.
ఘటనాస్థలి వద్ద ఉన్న వస్తువులు, మృతదేహంపై ఉన్న దుస్తులు ఆధారంగా చనిపోయింది జ్యోతినే అని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. మరోవైపు సిమ్రన్ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సిమ్రన్ కోసం గాలింపు చేపట్టారు. కేసు విచారణ సందర్భంగా యువతి హత్య తాలూకు ఫొటోలను ఆమె తల్లిదండ్రులకు చూపించగా మెడకున్న దారం, ముక్కుపుడక ఆధారంగా సిమ్రన్ అని గుర్తించారు.
దీంతో పారిపోయిన జ్యోతి, కృష్ణలను వెతికే పనిలో పడ్డ పోలీసులు.. వారిని గుర్తించి, 2020లో అదుపులోకి తీసుకున్నారు. కేసు కోర్టు విచారణలో ఉండగా క్షయవ్యాధితో కృష్ణ జైలులోనే చనిపోయాడు. ఈ ఘటనపై తీర్పు చెప్పిన పానిపత్ కోర్టు.. జ్యోతికి జీవితఖైదు విధించింది.
Also Read..
India Corona | రెండో రోజూ మూడు వేలకుపైనే కొత్త కేసులు.. 15వేల మార్క్‌ను దాటిన యాక్టివ్ కేసులు
Elon Musk | ట్విట్టర్లో రికార్డు సృష్టించిన మస్క్.. ఒబామాను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానానికి
Immortality | మరణం లేని జీవితం.. మరో ఏడేండ్లలో సాధ్యమే !
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

