ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ ముఠా గుట్టురట్టు.. నలుగురు అరెస్టు

హైదరాబాద్ : నగరంలోని లంగర్‌హౌజ్‌లో ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుల వద్ద నుంచి రూ.8.65 లక్షల నగదు, ఎనిమిది మొబైల్ ఫోన్లు, ఓ కారు, ఓ మోటారు సైకిల్, ల్యాప్‌టాప్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితులను వట్టేపల్లికి చెందిన సయ్యద్ జమురుద్దీన్, కుల్సుంపురకు చెందిన ఖాజా అసీం అహ్మద్, టోలిచౌకీకి చెందిన మహ్మద్ షాజబ్, కిషన్‌బాగ్‌కు చెందిన అజాంఖాన్గా గుర్తించారు. మరో ముగ్గురు సయ్యద్ అజారుద్దీన్, సయ్యద్ జహిరుబ్దిన్, తెహిరుద్దీన్ పరారీలో ఉన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు అన్నదమ్ములు సయ్యద్ అజార్, జహీర్, జమీర్ ఇతరులతో కలిసి గ్యాంగ్‌గా ఏర్పడి ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 17 వెబ్సైట్లను సృష్టించి బెట్టింగ్‌లో పాల్గొనే విధంగా నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. అన్ని చెల్లింపులు, రసీదులు ఆన్లైన్ బ్యాంక్ బదిలీల ద్వారా చేస్తున్నారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్‌లో మొత్తం 500 మంది పాల్గొన్నట్లు హైదరాబాద్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి. రాధా కృష్ణా రావు తెలిపారు. క్రికెట్, పేకాట, క్యాసినో, ఫుట్‌బాల్, టెన్నిస్, తదితర 100 రకాల గేమ్స్‌పై వీరు ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Osmania University | ఓయూలో పెన్‌డౌన్.. సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల నిరసన
Janhvi Kapoor | ‘పెద్ది’ వివాదంపై జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. అది నా తప్పే అంటూ కామెంట్
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో ముఖేష్-వర్షిణి ముద్దు ఫొటో కలకలం.. ఝాన్సీకి వార్నింగ్, రోహిత్ ఫైర్!
Malkajgiri Municipal Corporation | ఆయన చెప్పిందే వేదం.. నచ్చిన వారికే పోస్టింగ్‌లు
Sai Pallavi | భారతీయ ఇతిహాసం.. అత్యుత్తమ రూపంలో రామాయణం
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

