e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home క్రైమ్‌ అనుమానంతో కాబోయే భార్యను చంపేశాడు..

అనుమానంతో కాబోయే భార్యను చంపేశాడు..

అనుమానంతో కాబోయే భార్యను చంపేశాడు..
  • వరుసకు బావమరదళ్లు.. పెండ్లికి నిర్ణయం
  • ఇటీవల అనుమానం పెంచుకున్నాడు..
  • ఇంటికి పిలిచి హత్యచేసి.. సంపులో పడేశాడు
  • ఆలస్యంగా వెలుగులోకి..కూకట్‌పల్లిలో ఘటన

వరుసకు బావమరదళ్లు.. ఇద్దరు చునువుగా ఉంటుండటంతో ఇరు కుటుంబ పెద్దలు పెండ్లి చేయాలనుకున్నారు..అయితే ఇటీవల మరదలుపై అనుమానం పెంచుకున్నాడు.. ఇంటికి పిలిచి గొంతు నులి మి హత్య చేశాడు.. ఆపై మృతదేహాన్ని ఇంట్లోని సంపులో పడేశాడు.. ఈ సంఘటన ఈ నెల 10న జరుగగా సోమవారం వెలుగులోకి వచ్చింది. కూకట్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ నర్సింగరావు వివరాల ప్రకారం.. మూసాపేట, హబీబ్‌నగర్‌కు చెందిన సోమేశ్వర్‌రావు, నీలమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు . చిన్న కూతురు మంజుల(19) స్థానికంగా బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతుంది. కూకట్‌పల్లి, ఏవీబీ పురానికి చెందిన డిల్లేశ్వరరావు, ముత్యాలమ్మ దంపతుల చిన్న కుమారుడు భూపతి(21) బీటెక్‌ రెండో సంవత్సరం మధ్యలో ఆపేసి ఖాళీగా ఉంటున్నాడు. కాగా.. భూపతి, మంజుల వరుసకు బావమరదళ్లు.. దీంతో కొన్ని రోజులుగా చనువుగా ఉంటుండగా.. ఇరువర్గాల పెద్దలు వారికి వివాహం చేయాలని నిర్ణయించారు. అయితే.. ఇటీవల మంజుల ప్రవర్తనలో మార్పు వచ్చిందని ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 10న ఉదయం మంజులను తన ఇంటికి పిలిచాడు. ఈ క్రమంలో వారి మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. క్షణికావేశానికి గురైన భూపతి మంజుల గొంతు నొక్కి హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని ఇంటి సంపులో పడేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా ధైర్యం చాలక అదే రోజు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.. దీంతో ఈ విషయం బయటకు తెలిసింది..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అనుమానంతో కాబోయే భార్యను చంపేశాడు..

ట్రెండింగ్‌

Advertisement