హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారు ఇంజిన్లో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. కారు డ్రైవర్ అప్రమత్తమై క్షణాల్లోనే వాహనాన్ని ఆపేసి కిందకు దిగిపోయాడు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది. అయితే కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాద నేపథ్యంలో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.