పండుగ రోజు విషాదం నెలకొంది. ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డుమీదపడగా, ఆర్టీసీ బస్సు పైనుంచి పోవడంతో తల్లీ, కొడుకు మృతిచెందారు. తండ్రి, కూతురుకు తీవ్రగాయాలయ్యాయి.
కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ కు చెందిన ఎనగందుల అంజయ్య.. భార్య సౌజన్యకు కొడుకు యశ్వంత్, కూతురు అశ్విత ఉన్నారు. కరీంనగర్లో శనివారం జరిగిన ఓ శుభకార్యానికి కుటుంబం మొత్తం ద్విచక్రవాహనంపై వెళ్లారు. తిరిగి వస్తుండగా, మానకొండూర్ చెరువుకట్ట సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డుపైన పడిపోయింది. అదే సమయంలో వరంగల్ వైపు నుంచి కరీంనగర్ వస్తున్న ఆర్టీసీ బస్సు సౌజన్య, యశ్వంత్‌పై నుంచి పోవడంతో తల్లి సౌజన్య, కొడుకు యశ్వంత్ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తండ్రి అంజయ్య, కూతురు అశ్వితకు తీవ్ర గాయాలయ్యాయి.