తిరువనంతపురం : కేరళ సెలబ్రిటీ యూట్యూబర్ శ్రీకాంత్ వెట్టియార్పై లైంగిక దాడి కేసు నమోదైంది. పెండ్లి పేరుతో ఓ మహిళపై శ్రీకాంత్ లైంగిక దాడికి పాల్పడ్డాడని అభియోగాలు నమోదయ్యాయి. కొల్లం జిల్లాకు చెందిన మహిళ ఫిర్యాదు ఆధారంగా కొచ్చి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
కొచ్చిలోని ఓ హోటల్లో, అపార్ట్మెంట్లో నిందితుడు తనపై లైంగిక దాడులకు తెగబడ్డాడని బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించారు. మహిళా సాధికారత, రాజకీయ నిబద్ధతల వంటి అంశాలపై యూట్యూబర్ స్పందించే తీరుతో తాను ఆయన అభిమానినయ్యాయని ఆమె చెప్పారు. తాను కొచ్చిలో ఉండగా శ్రీకాంత్ వెట్టియార్తో సన్నిహితంగా మెలిగానని పేర్కొన్నారు.
గత ఏడాది ఫిబ్రవరిలో శ్రీకాంత్ తన బర్త్‌డే పార్టీకి ఆహ్వానించి ఎర్నాకుళంలోని ఫ్లాట్‌లో లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఆపై కొచ్చి నగరంలో హోటల్ రూంలోనూ లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని కూడా నిందితుడు తనపై ఒత్తిడి తెచ్చాడని ఆమె పేర్కొన్నారు. మహిళ ఫిర్యాదుపై కొచ్చి పోలీసులు యూట్యూబర్ శ్రీకాంత్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.