లక్నో : యూపీలో మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు బ్రేక్ పడటం లేదు. తాజా ఘటనలో బలియా సమీపంలోని గ్రామంలో 13 ఏండ్ల బాలికపై పొరుగు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సోమవారం సాయంత్రం లైంగిక దాడికి పాల్పడ్డారు.
బాధితురాలి తండ్రి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించామని గద్వార్ పీఎస్ ఎస్హెచ్ఓ దుర్గేశ్వర్ మిశ్రా తెలిపారు.