రూ 109 కోట్ల స్కామ్‌లో మైక్రోఫైనాన్స్ కంపెనీ ఎండీ అరెస్ట్
ఆర్ధికంగా వెనకబడిన వర్గాలకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు రుణాల పేరుతో రూ 109 కోట్లు కొల్లగొట్టిన మైక్రోఫైనాన్స్ కంపెనీ ఎండీని ఒడిషాలోని సుందర్ఘఢ్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు.
భువనేశ్వర్ : ఆర్ధికంగా వెనకబడిన వర్గాలకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు రుణాల పేరుతో రూ 109 కోట్లు కొల్లగొట్టిన మైక్రోఫైనాన్స్ కంపెనీ ఎండీని ఒడిషాలోని సుందర్ఘఢ్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. సంస్ధ ఎండీ దీపక్ కిండోపై ఏడాది కిందట లుక్అవుట్ నోటీస్ జారీ చేసిన క్రమంలో గురువారం ఆయన స్వగ్రామం తలసర బ్లాక్‌లోని లుల్కిడిహిలో ఒడిషా పోలీస్ ఆర్ధిక నేరాల విభాగం పోలీసులు కిండోను అరెస్ట్ చేశారు.
ఆర్బీఐ వద్ద ఎన్బీఎఫ్సీ-ఎంఎఫ్ఐగా నమోదైన సంబంధ్ ఫిన్సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కిండో బ్యాంకులు ఇతర ఆర్ధిక సంస్ధల నుంచి నిధులను రాబట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు తక్కువ వడ్డీరేటుతో రుణాలను అందచేస్తుంటాడు. అయితే 2015 నుంచి 2020 వరకూ కిండో కంపెనీ ఫోర్జరీ పత్రాలతో పలు ఇన్వెస్టర్లు, రుణ సంస్ధల నుంచి రూ 109 కోట్లకు పైగా నిధులు రాబట్టింది.
వీటిని అర్హులైన పేదలకు రుణాల కింద పంపిణీ చేయాల్సి ఉండగా తన వ్యక్తిగత ఖాతాలతో పాటు బంధువుల ఖాతాలకు, సంబంధ్ సబ్సిడరీల ఖాతాలకు మళ్లించాడు. ఈ కేసులో ఇప్పటికే కిండో భార్య అమృతను అరెస్ట్ చేయగా ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- arest
- MD
- Microfinance
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

