Viral Video: టోల్ బూత్‌ను ఢీకొట్టిన అంబులెన్స్… రోగితో సహా నలుగురు మృతి
బెంగళూరు: వేగంగా వెళ్తున్న అంబులెన్స్ అదుపు తప్పి టోల్ బూత్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న రోగి, ఇద్దరు సహాయకులు, టోల్ బూత్ సిబ్బంది సహా నలుగురు మరణించారు. అంబులెన్స్ డ్రైవర్ గాయపడ్డాడు. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో బుధవారం ఈ సంఘటన జరిగింది. కుందాపురం నుంచి ఒక రోగిని అంబులెన్స్‌లో హొన్నవర ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే జోరు వర్షంలో కూడా ఆ అంబులెన్స్ వేగంగా ప్రయాణిస్తున్నది. బైందూరు సమీపంలోని టోల్ గేట్ సిబ్బంది అంబులెన్స్‌ను గమనించారు. ప్రత్యేక లైన్లో దానికి దారి ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న ప్లాస్టిక్ బారికేడ్లను వేగంగా తొలగించారు.
కాగా, వర్షానికి టోల్ ప్లాజా వద్ద రోడ్డు బాగా తడిసి ఉంది. అయితే అంబులెన్స్ వేగంతో ఆ లైన్ నుంచి వెళ్లేందుకు ప్రయత్నించి అదుపు తప్పింది. వాహనం చక్రాలు రోడ్డుపై జారాయి. దీంతో అది వేగంగా టర్న్ అయ్యి టోల్ ప్లాజా క్యాబిన్‌ను బలంగా ఢీకొట్టి బొల్తా కొట్టింది. ప్రమాదం ధాటికి అంబులెన్స్‌లో ఉన్న రోగి, ఇద్దరు సహాయకులు వాహనం నుంచి రోడ్డుపైకి ఎగిరి పడి మరణించారు. అలాగే అంబులెన్స్ ఢీకొనడంతో ఒక టోల్ బూత్ సిబ్బంది కూడా చనిపోయాడు.
అయితే తీవ్రంగా గాయపడిన డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. మరోవైపు అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ప్రమాద ఘటన చాలా బీభత్సంగాను ఒళ్లు జలదరించేలా ఉంది.
#WATCH | Karnataka: Four people were injured after a speeding ambulance toppled at a toll gate, near Byndoor. The Ambulance was carrying a patient to Honnavara. Further details are awaited.
(Source: CCTV) pic.twitter.com/M3isDaX7Eg
— ANI (@ANI) July 20, 2022
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

