చండ్రుగొండ: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన గురువారం చండ్రుగొండ మండలంలో చోటు చేసుకున్నది అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన కాకటి నాగరాజు(28) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొన్నాళ్లుగా మద్యానికి బానిసైన నాగరాజు కుటుంబంలో కలహాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి సైతం మద్యం సేవించిన నాగరాజు భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.
గురువారం ఉదయం గ్రామం ప్రక్కనే ఉన్న మామిడితోటలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై బి.రాజేష్‌కుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించి,మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.