బార్బర్ షాపులో షేవింగ్ చేయించుకుంటున్నాడా వ్యక్తి. అప్పటి వరకు ఒక పక్కన నిలబడి ఉన్న మరో వ్యక్తి.. సడెన్‌గా వెనక్కు తిరిగి తుపాకీతో అతన్ని కాల్చాడు. త్రుటిలో తుపాకీ గుండును తప్పించుకున్న అతను.. చటుక్కున కుర్చీలో నుంచి లేచి, తనపై కాల్పులు జరిపిన వ్యక్తిని అడ్డుకోబోయాడు. అప్పటికే ఆ దుండగుడు తనకు దొరికిన రేజర్ బ్లేడుతో దాడి చేయబోయాడు.
అంతలో బయట నుంచి మరో దుండగుడు వచ్చి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈసారి వచ్చిన బుల్లెట్ నేరుగా వచ్చి తలలో దిగడంతో ఆ వ్యక్తి కింద పడిపోయాడు. ఈ దారుణం అంతా.. బార్బర్ షాపులోని సీసీ కెమెరాలో రికార్డయింది. బిహార్‌లోని బక్షర్ జిల్లాలో దుమ్రావ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
స్థానికంగా మున్సిపల్ కౌన్సిలర్‌గా ఉన్న సోనూ రాయ్ అనే వ్యక్తికి ఒక తమ్ముడు ఉన్నాడు. అతని పేరు మోను రాయ్. మోను ఇటీవలే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్లిద్దరి కులాలు వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు ఈ వివాహానికి ఒప్పుకోలేదు.
అయినా వాళ్లు పెళ్లి చేసుకోవడంతో.. అమ్మాయి తండ్రి, రిటైర్డ్ ఆర్మీ అధికారి సునీల్ పాఠక్ ఆగ్రహం తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే తన కుమారుడు ధాను పాఠక్‌తో కలిసి మోనూను హతమార్చాలని ప్లాన్ చేశాడు. అతను బార్బర్ షాపులో ఉండగా.. తండ్రీకొడుకులు ఇద్దరూ తుపాకులతో దాడి చేశారు.
పాయింట్ బ్లాంక్ రేంజ్లో తలలో తూటాలు దింపారు. ఆ తర్వాత మోనూ శరీరాన్ని ఒక మూలకు లాక్కెళ్లి కాళ్లతో తంతూ.. తుపాకులను రీలోడ్ చేసుకోవడానికి ప్రయత్నించారు. అవి స్టక్ అవడంతో మోనూ మళ్లీ లేవకుండా తొక్కిపట్టి, రీలోడ్ చేసుకున్నారు.
ఆపై మళ్లీ అతన్ని కాల్చారు. దీంతో మోనూ అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఆ తర్వాత స్వయంగా పోలీసులకు ఫోన్ చేసిన సునీల్ పాఠక్.. సరెండర్ అయిపోయాడు. కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీసులు.. తండ్రీకొడుకులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
अंतरजातीय विवाह करने की मोनू राय को उनके ससुर रिटायर्ड फ़ौजी ससुर सुनील पाठक ने अपने बेटे के साथ बक्सर ज़िले के डुमरांव में गोली मार कर हत्या कर सजा दी और बाद में खुद एसपी को फ़ोन कर सरेंडर भी किया @ndtvindia @Anurag_Dwary pic.twitter.com/VDzhUjmHcx
— manish (@manishndtv) June 7, 2022