అహ్మదాబాద్ : పెండ్లి పేరుతో బాలిక (16)ను లోబరుచుకున్న యువకుడు (26) ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్‌లోని నరన్పుర ప్రాంతానికి చెందిన నిందితుడు దినేష్ బబుల్‌పై ఘట్లోదియా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు బాలికను మభ్యపెట్టి ఆపై అపహరించి అహ్మదాబాద్, చోటిల ప్రాంతాల్లో హోటల్ రూమ్‌లలో ఆరు నెలలుగా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఏడాది కిందట బాలికతో స్నేహం పెంచుకున్న నిందితుడు ఆపై ఆమెకు డబ్బు ఆశచూపడంతో పాటు పెండ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. బాలికను పలు ప్రాంతాలకు తిప్పుతూ లైంగిక వేధింపులకు గురిచేశాడు. బాలిక కుటుంబసభ్యులకు విషయం తెలియడంతో నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాబుల్ కదలికలపై కన్నేసిన పోలీసులు శుక్రవారం అతడిని పట్టుకున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించగా లైంగిక దాడి జరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. నిందితుడిపై పోక్సో, కిడ్నాప్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.