Electricity Scam : ఓటీపీ షేర్ చేయకున్నా బ్యాంక్ ఖాతా నుంచి రూ. 3 లక్షలు ఊడ్చేశారు
Electricity Scam : గత కొద్దినెలలుగా దేశవ్యాప్తంగా ఆన్లైన్ స్కామ్‌లు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకో తరహా స్కామ్‌తో సైబర్ నేరగాళ్లు చెలరేగుతూ అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు.
Electricity Scam : గత కొద్దినెలలుగా దేశవ్యాప్తంగా ఆన్లైన్ స్కామ్‌లు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకో తరహా స్కామ్‌తో సైబర్ నేరగాళ్లు చెలరేగుతూ అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ కనెక్షన్‌ను తక్షణమే తొలగిస్తామని 77 ఏండ్ల డాక్టర్‌కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫిబ్రవరి 23న బెదిరింపు కాల్ రావడంతో బాధితుడికి కష్టాలు ప్రారంభమయ్యాయి.
తమను కాంటాక్ట్ చేయాలని స్కామర్లు ఒత్తిడి తెచ్చినా వారి సూచించిన నెంబర్‌కు కాల్ చేసేందుకు డాక్టర్ నిరాకరించారు. స్కామర్ల బలవంతంతో అప్‌గ్రేడ్ పేరుతో స్కామర్లకు డాక్టర్ రూ. 10 చెల్లించారు. ఆపై నిందితులు పంపిన లింక్‌లో వారు ఇచ్చిన సూచనలకు అనుగుణంగా బాధితుఉ తనకు తెలియకుండానే డెబిట్ కార్డు వివరాలు వెల్లడించారు.
ఆపై తన బ్యాంక్ ఖాతా నుంచి అనధికారికంగా పలు లావాదేవీలు జరిగాయని గుర్తించారు. ఎలాంటి ఓటీపీ వెరిఫికేషన్ లేకుండానే తన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు డ్రా చేసినట్టు గుర్తించారు. దీంతో ఈ ఘటనపై బాధిత డాక్టర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Health Tips | ఆ గోళీలు మితిమీరినా ప్రమాదమే
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Electricity Scam
- loses
- MAN
- media
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

