Crime news: అనుమానం పెనుభూతమైంది. ఓ నిండు ప్రాణం బలయ్యింది. ఓ వ్యక్తి తాను కట్టుకున్న భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతున్నదని అనుమానించాడు. అనుమానం అంతకంతకే పెరిగిపోవడంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఓ పదునైన కత్తి కొనుగోలు చేసి ఆమెను గొంతుకోసి చంపేశాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్నగర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ముజఫర్నగర్ జిల్లా బుధానా పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ టైల్స్ ఫ్యాక్టరీలో హతురాలు, ఆమె భర్త ఇద్దరూ పనిచేసేవారు. అయితే, వారితోపాటే ఆ ఫ్యాక్టరీలో పనిచేసే మరో కార్మికుడితో హతురాలు అక్రమసంబంధం పెట్టుకుందని ఆమె బర్త అనుమానించాడు. రోజురోజుకు అనుమానం మరింత బలపడటంతో గురువారం రాత్రి పదునైన కత్తితో ఆమెపై దాడికి పాల్పడి గొంతుకోసి చంపాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.