గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Aug 06, 2020 , 11:36:14

చెల్లికి సైకిల్ కొనివ్వ‌లేద‌నే బాధ‌తో అన్న ఆత్మ‌హ‌త్య‌

చెల్లికి సైకిల్ కొనివ్వ‌లేద‌నే బాధ‌తో అన్న ఆత్మ‌హ‌త్య‌

ల‌క్నో : రాఖీ పండుగ రోజున త‌న చెల్లికి కానుక‌గా సైకిల్ కొనివ్వ‌లేద‌నే బాధ‌తో ఓ అన్న ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ విషాద ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌లో బుధ‌వారం చోటు చేసుకుంది. కొదాన్‌పూర్వ గ్రామానికి చెందిన పుట్టిలాల్(22) రాఖీ పండుగ రోజున త‌న చెల్లికి కానుక‌గా సైకిల్ కొనిస్తాన‌ని ప్రామీస్ చేశాడు. అయితే అత‌ని వ‌ద్ద స‌మ‌యానికి డ‌బ్బులు లేక‌పోవ‌డంతో బాధ‌ప‌డ్డాడు. పండుగ రోజున చెల్లికి గిఫ్ట్ ఇవ్వ‌లేద‌న్న బాధ‌తో తీవ్ర మాన‌సిక వేద‌న‌కు గుర‌య్యాడు. మంగ‌ళ‌వారం రాత్రి ఇంట్లోనే అంద‌రితో క‌లిసి అన్నం తిన్నాడు. ఆ రోజు రాత్రి ఇంటి నుంచి అదృశ్య‌మ‌య్యాడు. బుధ‌వారం పొద్దున్నే బ‌ర్రాజ్‌పూర్ రైల్వేస్టేష‌న్ వ‌ద్ద గూడ్స్ రైలుకు అడ్డంగా వెళ్లి పుట్టిలాల్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. పుట్టిలాల్ మృతితో త‌ల్లిదండ్రులు, బంధువులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. ఆ గ్రామంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.


logo