కదులుతున్న రైలు నుంచి మహిళ తోసివేత : నిందితుడి అరెస్ట్
లైంగిక వేధింపులను ప్రతిఘటించిన మహిళను మధ్యప్రదేశ్లోని చతార్పూర్ జిల్లాలో కదులుతున్న రైలు నుంచి తోసివేసిన ఘటనలో నిందితుడి(26)ని పోలీసులు అరెస్ట్ చేశారు.
భోపాల్ : లైంగిక వేధింపులను ప్రతిఘటించిన మహిళను మధ్యప్రదేశ్లోని చతార్పూర్ జిల్లాలో కదులుతున్న రైలు నుంచి తోసివేసిన ఘటనలో నిందితుడి(26)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 27న జరిగిన ఈ ఘటనలో యూపీలోని బందా జిల్లాకు చెందిన మహిళ(22)కు గాయాలయ్యాయి.
ప్రస్తుతం బాధితురాలు దవాఖానలో చికిత్స పొందుతోంది. చత్తార్పూర్లోని భగేశ్వర్ ధామ్లో ఆలయాన్ని సందర్శించేందుకు మహిళ వెళుతుండగా సహ ప్రయాణీకుడు ఆమెను కదులుతున్న రైలులో వేధింపులకు గురిచేశాడు. నిందితుడి చర్యను ప్రతిఘటించిన ఆమె దూరంగా వెళ్లాలని కోరింది.
దీంతో కదులుతున్న రైలు నుంచి మహిళను నిందితుడు బయటకు తోసివేశాడు. మహిళను వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా ఆపై మెరుగైన చికిత్స కోసం గ్వాలియర్ తరలించామని జబల్పూర్ ఎస్హెచ్ఓ ఆకాంక్ష సింగ్ తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

