ముంబై : మహారాష్ట్రలోని థానే సమీప గ్రామంలో ఒంటరిగా ఇంట్లో ఉన్న బాలిక(17)పై లైంగిక దాడికి పాల్పడిన యువకుడి (28)ని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కుల్గాం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు, బాధితురాలు ఇరుగుపొరుగు వారు కాగా, బాలిక తల్లి పనికి వెళ్లిన సమయంలో బాధితురాలు ఒంటరిగా ఉందని తెలసుకున్న నిందితుడు బలవంతంగా ఇంట్లోకి చొరబడి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బెదిరించాడు. పని ముగిసిన తర్వాత ఇంటికి వచ్చిన తల్లికి బాలిక జరిగిన విషయం చెప్పడంతో ఇద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.